
డిచ్ పల్లి మండలం లోని ఖిల్లా డిచ్ పల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి డి.బాబురావు ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ ఇంజినీర్ తనవంతుగా ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా టై, బెల్టులు కొనుగోలు నిమిత్తం ఇరవై వేల రూపాయలు విరాళంగా మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందజేశారు. పూర్వ విద్యార్థి దతృత్వానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి బి.సీతయ్య, ఉపాధ్యాయ బృందం దన్యవాదములు తెలిపారు.