
పంతంగి గ్రామ స్కూల్ 1999-2000 సంవత్సర బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఆందోల్ మైసమ్మ ఆలయం దగ్గర నిర్వహించడం జరిగింది. ముందుగా పంతంగి స్కూల్ లో సరస్వతి విగ్రహనికి నివాళి అర్పించి అనంతరం, విద్య నేర్పిన గురువులకు పూలతో ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గురువులకు సన్మానం చేయడం జరిగింది. పూర్వ విద్యార్థులు ఒకరికి ఒకరు సన్మానం చేసుకున్నారు. గురువులా ప్రసంగాలు పూర్వ విద్యార్థుల,విద్యార్థినిలా ప్రసంగాలు కూడా ఇచ్చారు. ఎంతో ఉత్సహంగా,ఆనందంగా జరిగిన ఈ ఆత్మీయసమ్మేళనంలో బోయ లింగస్వామి సభాధ్యక్షులుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువులు ఆంజనేయు లు,పాపయ్య,కోటిరెడ్డి, రమణారెడ్డి,సత్యనారాయణ,బిక్కు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.