ఏర్గట్లలో పూర్వ విద్యార్థుల కోలాహలం

నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2011-2012 లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు అందరు ఒకే చోట చేరి సందడి చేశారు. వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ..ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు.అనంతరం విద్యార్థులనుద్దేశించి గురువులు మాట్లాడుతూ…మేము బోధించిన పాఠాలు జీవితంలో మీకు మంచి అనుభవాలుగా ఉయోగపడ్డాయని మేము అనుకుంటున్నాం అని, మీరు జీవితంలో మరెన్నో ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరుకుంటున్నాం అని అన్నారు.