మండలంలోని చేపూర్ హైస్కూల్ 1998, 1999 పదవ తరగతి బ్యాచ్ చెందిన వారు మొన్న అకాల మరణం పొందిన వన్నెల (మంగళి) ప్రభాకర్ కుటుంబానికి సోమవారం రూ.5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగ బ్యాచ్ చెందిన అగల్దివిటి శివ మాట్లాడుతూ.. మా బ్యాచ్ తరఫున మీ కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మృతుని కుటుంబానికి తెలియపరచడం జరిగింది. మా బ్యాచ్ తరఫున ఇప్పటివరకు మేము ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇతరత్రా సహాయం చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ మీణుగు రాజేశ్వర్, 1998, 1999, ఎస్ఎస్ సీ బ్యాచ్ కు సంబంధించిన పొద్దుటూరి శ్రీకాంత్, బట్టు గంగ ప్రసాద్, పొద్దుటూరి గంగ మోహన్ బిజెపి యూత్ నాయకుడు బబ్లూ, శివ రాజ్ మంగళి శ్రీనివాస్, మహిళా నాయకురాలు లత పాల్గొన్నారు.