నవతెలంగాణ – ఆర్మూర్
జడ్పీహెచ్ఎస్ ఆలూరు పాఠశాలకు కె దిలీప్ అనే కబడ్డీ క్రీడాకారుడు దాదాపు 12 వేల రూపాయల క్రీడా సామాగ్రిని సోమవారం పాఠశాలకు అందించారు. ఈ సామాగ్రిలో భాగంగా (10 వాలీబాల్ ,4 హ్యాండ్ బాల్స్,1 బ్యాడ్మింటన్ నెట్ అదేవిధంగా ఒక క్రికెట్ నెట్ )స్పాన్సర్ చేయడం జరిగింది. పాఠశాల అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క క్రీడ సామాగ్రి అందించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్, స్థానిక పాఠశాల పిడి రాజేష్ లు దిలీప్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున దిలీప్ కు సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మీయొక్క సహాయ సహకారాలు పాఠశాలకు ఇలానే కొనసాగాలని భవిష్యత్తులో క్రీడల్లో కూడా ఆలూరు పాఠశాలను ముందుకు తీసుకెళ్తామని మరి దీనికి ప్రయత్నం చేసిన పాఠశాల పిడి రాజేష్ కూడా అభినందించారు .ఈ కార్యక్రమంలో విడిసి చైర్మన్ బార్ల ముత్యం, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ మాజీ ఎంపిటిసి మల్లేష్, పాఠశాల శ్రేయోభిలాషులు ముత్యం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.