– ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్
నవ తెలంగాణ – ముషీరాబాద్
ఆలూరి విల్సన్ స్వచ్ఛమైన మనిషి అని, నిరంతరం సమకాలీన కవిత్వం రాస్తూ తన దైన శైలిలో సాహిత్య సేవ చేస్తున్నారని ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ గద్దర్ ప్రాంగణంలో రవ్వా శ్రీహరి వేదికపై భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆలూరి విల్సన్ కవితా సంపుటి హరివిల్లు’ ను ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆవిష్కరి ంచారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత మాణిక్య రెడ్డి, చొక్కాపు వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.