ఘనంగా అమరవరం పాఠశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు..

– విద్యార్ధులు గా విడిపోయి ప్రయోజకులు గా కలిసిన పూర్వ విద్యార్ధులు…

– గురువులను సన్మానించిన శిష్యులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్ధులుగా విడిపోయి ప్రయోజకులు కలిసిన పూర్వ విద్యార్ధులు సమావేశం ఘనంగా జరిగింది.తమకు విద్యాబోధనలు చేసిన గురువులను అత్యంత భక్తిశ్రద్ధలతో సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా,కుక్కునూరు మండలం అమరవరం పాఠశాల 75 వసంతాల ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్ధులు వారికి విద్యాబుద్దులు నేర్పిన గురువులను అత్యంత భక్తి శక్తి శ్రద్ధలతో శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి మర్యాద పూర్వకంగా సన్మానించారు. 1948 లో  ఏర్పాటు అయిన అమరవరం పాఠశాలలో చదివిన విద్యార్ధులు ఎందరో ప్రస్తుతం ప్రవాస భారతీయులుగా,ప్రవాసాంద్రులుగా స్థిరపడ్డారు.స్థానికంగా నాటి విద్యార్ధులు ఎందరో పలు ప్రభుత్వ శాఖల్లో రాష్ట్ర సాయి అధికారులు గా,వివిధ రాజకీయ పార్టీల్లో రాష్ట్ర స్థాయీ నాయకులు,ఎ 1కాంట్రాక్టర్ లు సమాజంలో సేవలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఈ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను జాతీయ ఈ గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్ దక్షిణ భారత సలహాదారు రావులు పాటి శంకర్ రావు, తంతి తపాలా శాఖ సహాయ పరిపాలన అధికారి(విశ్రాంత) తోటమళ్ళ వెంకటి,పాల్వంచ ప్రభుత్వం డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఆర్.వెంకటి, దక్షిణ భారత రైల్వే శాఖ ఇంజనీరింగ్ విభాగం విశ్రాంత అధికారి యల్లంకి రామారావు, నవతెలంగాణ విలేకరి మేడిపల్లి వెంకటేశ్వరరావు, స్థానిక హెచ్.ఎం ఎం.వి. సత్యనారాయణ సారధ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన 3 వేలు మందికి స్థానికి పాఠశాల పూర్వ విద్యార్ధి, సాంఘీక సంక్షేమ శాఖ విశ్రాంత అధికారి గుండె బోయిన సత్యనారాయణ(బాబ్జీ) స్వంత ఖర్చులతో భోజన వసతి కల్పించారు.