న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రారంభించినట్టు తెలిపింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఆఫర్ల సేల్ ఉంటుందని శుక్రవారం ఆ సంస్థ వెల్లడించింది. నాలుగు రోజుల పాటు సాగే సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై ఆకర్షణీయ ఆఫర్లు పొందవచ్చని పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోన్నట్టు తెలిపింది.