– మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
– అంగన్‌వాడీ భవనం, మినీ గ్రంథాలయ భవనం, ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ-కందుకూరు
అమెజాన్ కంపెనీ సేవలు మరువలేనివి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నా రు. శుక్రవారం మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో మినీ అంగన్‌వాడీ భవనం, కొత్తూరు గ్రామంలో మినీ గ్రంథాలయ భవనాలను ప్రారం భించారు. కొత్తగూడ గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అ మెజాన్ కంపెనీ సహకారంతో జిల్లాలలో మినీ అం గన్‌వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలో మౌ లిక వసతుల కల్పన చేశారన్నారు. అంగన్‌వాడీ భవ నంలో మౌలిక వసతులు కల్పించడం సంతోష కరమన్నారు. కొత్తూరు గ్రామంలో మినీ గ్రంథాల య భవనం ద్వారా విద్యార్థులతో పాటు, నిరు ద్యోగులు చదువుకోవడానికి ఎంతో ఉపయోగక రంగా ఉంటుందన్నారు. ఉద్యోగాల వేటలో ఇక్కడ ఉండి చదువుకొని పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సా ధించడానికి అవకాశం ఉంటుందన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కో రారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో గంట పాటు పుస్తకాలు చదువుకోవాలని కోరారు. తద్వా రా విజ్ఞానం పెంపొందించుకోవచ్చు అన్నారు. ఈ దిశగా అడుగులు వేయాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. ఇంటింటికీ ప్రతి ఒక్కరూ 5 మొక్కలు చొప్పున నాటాలని కోరా రు. అమెజాన్ సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని మ హేశ్వరం నియోజకవర్గంలో మరిన్ని సేవలు చేస్తా రని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సరిత, సొసైటీ చైర్మెన్ దేవరశెట్టి చంద్ర శేఖర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి, లెక్చరర్స్, సురసాని సురేందర్ రెడ్డి, లక్ష్మీ నరసింహరెడ్డి, మాజీ సర్పంచ్ కాసుల రామ కృష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బుడ్డీరపు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఉన్ని వెంకటయ్య, మాజీ ఎంపీ టీసీ తాండ్ర ఇందారా దేవందేర్, జీ. సురేష్, డైరెక్ట ర్ పొట్టి ఆనంద్, గ్రామ ప్రత్యేక అధికారి లావణ్య, మాజీ సర్పంచ్ పల్లె వసంత కృష్ణ గౌడ్, ప్రత్యేక అధికారి ఎండీ హబీబ్, పంచాయతీ కార్యదర్శులు రాఘవేందర్, సురేందర్, నాయకులు మొన్నే జ యేందర్, అనెగౌనీ అంజయ్య గౌడ్, సామ ప్రకాష్ రెడ్డి, దామోదర్ గౌడ్, మేఘనాథ్ రెడ్డి, అంకగళ్ళ కుమార్, మిద్దెగణేష్, నల్లి శ్రీధర్, బాబుగౌడ్, మే ఘనాథ్‌రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఒక దీక్షిత్ రెడ్డి, తాళ్ల కార్తీక్, అమెజాన్ కంపెనీ శ్రీశంకర్, చైతన్యపాటిక్, విజరు, సెర్చ్‌ఉద్యోగులు పార్థసారథి, సురేష్, నాగరాజు, శివకృష్ణ, సుధాకర్, విద్యార్థులు పాల్గొన్నారు.