నవతెలంగాణ – హైదరాబాద్: ‘ హెల్తీ అండ్ ఫిట్ ఇండియా’ ను ప్రో త్సహించాలని భారతదేశపు కలను మద్దతు చేయడానికి మరియు సంబరం చేయడానికి , భారతదేశపు సెల్లర్స్ నుండి యోగాకు అవసరమైన సాటిలేని ఎంపికను తీసుకువచ్చే ‘యోగా స్టోర్ ’ ఆరంభాన్ని అమేజాన్ ఇండియా ప్రకటించింది. గౌరవనీయ శ్రీ సర్బానంద సోనోవల్, ఆయుష్ మరియు రేవులు, షిప్పింగ్ & జల మార్గాలు శాఖా మంత్రి, భారత ప్రభుత్వంచే అధికారికంగా ఆఫ్ లైన్ లో ఆరంభించబడిన ఈ స్టోర్ కస్టమర్స్ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించడానికి ఒక అవకాశం ఇవ్వడమే కాకుండా ఆరోగ్యం మరియు శారీరక ధారుడ్యం శ్రేణిలో వృద్ధి చెందుతున్న భారతదేశపు బ్రాండ్స్ మరియు తయారీదారుల వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యాన్ని కూడా కలిగి ఉంది. గౌరవనీయ శ్రీ సర్బానంద సోనోవల్, ఆయుష్ మరియు రేవులు, షిప్పింగ్ & జల మార్గాలు శాఖా మంత్రి, భారత ప్రభుత్వం ఇలా అన్నారు, “సమగ్రమైన సంక్షేమాన్ని ప్రోత్సహించే ఒక ప్రాచీనమైన ఆచరణ విధానం యోగా మరియు ఇది పూర్తి జీవిత నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యాన్ని కలిగి ఉంది. నేను ఆరంభించడంలో భాగంగా ఉండటానికి ఆనందిస్తున్నాను గౌరవనీయ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ హెల్దీ అండ్ ఫిట్ ఇండియా’ కలతో అనుసంధానంగా ‘యోగా స్టోర్ ఫ్రంట్’ ను విజయవంతంగా ఆరంభించినందుకు నేను హృదయపూర్వకంగా అమేజాన్ ఇండియా వారికి అభినందనలు తెలుపుతున్నాను. భారతదేశపు ఈ-కామర్స్ మరియు ఔత్సాహికత ప్రపంచాన్ని పరివర్తనం చేయడానికి మరియు తీర్చిదిద్దే దిశగా అమేజాన్ ఇండియా నుండి ఇది మరొక గణనీయమైన తోడ్పాటు.” మనీష్ తివారి, వైస్ ప్రెసిడెంట్ & కంట్రీ మేనేజర్, కంజ్యూమర్ బిజినెస్, అమేజాన్ ఇండియా ఇలా అన్నారు, “ఆరోగ్యవంతమైన మరియు ఫిట్ ఇండియా ను నిర్మించే ప్రభుత్వ కలకు మద్దతు చేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఉన్నతమైన నాణ్యత గల యోగా ఉత్పత్తులు, సామగ్రి మరియు వనరులను మా కస్టమర్స్ కు కేటాయించడానికి మరియు వారి శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక సంక్షేమాన్ని మద్దతు చేసే మా ప్రయత్నంతో, యోగా స్టోర్ స్థానిక తయారీదారులు మరియు సెల్లర్స్ ను పోషించడానికి మరియు మద్దతు చేయడానికి అమేజాన్ ఇండియా వారి నిబద్ధతను కూడా యోగా స్టోర్ బలోపేత్తం చేస్తోంది.” అమేజాన్ ఇండియా వారి యోగా స్టోర్ వేలాది సెల్లర్స్ మరియు 10k+ వివిధ ఉత్పత్తులను కూడా అందుబాటులో ఉంచుతోంది. యోగా మ్యాట్స్, బ్లాక్స్, యోగా వీల్, యాక్ససరీస్ & ఇంకా ఎన్నో యోగా అవసరాలు పై గొప్ప డీల్స్ ను కూడా కస్టమర్స్ పొందడానికి స్టోర్ ఒక సమగ్రమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. అమేజాన్ ఇండియా ఏరియల్ యోగా, అయ్యంగార్ యోగా ఉత్పత్తులు, యోగా ఉత్పత్తులు, పిల్లలు కోసం యోగా మ్యాట్స్, ట్రావెల్ యోగా మ్యాట్స్ మరియు ఇంకా ఎన్నో ఉప-శ్రేణులలో కూడా అమేజాన్ ఇండియా తమ ఆఫరింగ్స్ ను విస్తరిస్తోంది.