నవతెలంగాణ-షాబాద్
విద్యార్థుల కోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవలు అభినందనీయమని ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్‌రెడ్డి అన్నారు. షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో అంగన్‌వాడీ భవనం సుందరీకరణ అమెజాన్ వెబ్ సర్వీసెస్, సర్చ్ స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సుందరీకరణ, మౌలిక వసతులను ఎంపీడీవో అపర్ణ, ఎంపీటీసీ కుమ్మరి చెన్న య్యలతో కలిసి శనివారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ…. విద్యార్థుల కోసం అమెజాన్ వెబ్సర్వీసు ఎంతో ఖర్చు చేస్తున్నారని తెలిపారు. షాబాద్ మండలంలో పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, పునరుద్ధరణలో భాగంగా సంస్థ మౌలిక వసతులు కల్పించిన ట్లు తెలిపారు. ప్రచారానికి పోకుండా సమాజాసేవ కోసం కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసు అందిస్తున్న సేవలను వారు కొనియా డారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రమాదేవి, ప్రత్యేకాధికారి శార ధ, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ ఈదుల నర్సింహులుగౌడ్, మాజీ సర్పంచులు కొత్త పాండురంగారెడ్డి, ఈదుల కృష్ణగౌడ్, సురేష్‌గౌడ్, అంగన్‌వాడీ టీచర్ మీన, ఆమెజన్ డేటా సెంటర్ ఆడ్వజర్ శంకరన్, సర్చ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సురేష్, నాగరాజు, పంచాయతీ కార్యదర్శి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.