నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జిల్లా కేంద్రంలోని సమీకత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ బీ.ఎం. సంతోష్ పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. అనం తరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై కలెక్టర్ తన ప్రసంగంలో వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో పదేండ్లు నిండాయని, ఆదివారం జిల్లాలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివద్ధి దిశగా పయనిస్తుందని తెలిపారు. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజా పాలనా కార్యక్రమం నిర్వహించి 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిందన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం జరిగిందని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని అన్నారు. ఉచిత గహ విద్యుత్తును అందించే గహ జ్యోతి పథకాన్ని, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 లకు గ్యాస్ సిలిండర్ పథకం, 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1, 2, 3, 4 నియామకాలపై దష్టి సాధించిందన్నారు. త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు ఒక కోటి 57 లక్షల 51వేల ఎకరా కలకు రూ.7,625 కోట్ల నిధులను విడుదల చేసిందని, ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసిందన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే రాష్ట్రమంతటా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి బడిలో చదివే పిల్లల తల్లుల భాగస్వామ్యాన్ని పెంచటం ద్వారా విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు కషి చేయడం జరుగుతుందని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ఏక రూప దుస్తుల పనులన్నీ గ్రామాల్లో గల స్వయం సహాయక సంఘాలతో చే యించి పాఠశాలలో పున:ప్రారంభం లోపు అందించడం జరుగుతుందన్నారు. దీంతో జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలుకు ఆర్థిక చేయుతను అందించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. అంతకు ముందు స్మతి వనంలోని అమరవీరుల స్మారక స్థూపానికి ,జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమములో తమ ప్రాణాలర్పించిన పాస్యం సర్వ రెడ్డి, కొట్టం వేణుగోపాల్ అమరవీరులకు జిల్లా కలెక్టర్ , ఎస్పీ ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత , ఎస్పీి రితిరాజ్, అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఆర్ డీి ఓ రామ్ చందర్, కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి వీర బద్రప్ప , వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీరితిరాజ్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి తెలంగాణ ఆవీర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే అభివద్ధి వేగవంతం అవుతుందన్నారు. సంఘ విద్రోహక శక్తుల పట్ల కఠినంగా ఉంటూ, సామాన్య ప్రజలలో భరోసా కల్పిస్తూ, ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన సేవలు అందిస్తునామని అన్నారు. అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేసి జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తూ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం గత సంవత్సరం లో రాష్ట్ర స్థాయి లో సేవ పతకంలు పొందిన ఏ ఆర్ ఎస్‌ఐ ఆర్. పుల్లన్న, హెడ్ కానిస్టేబుల్స్ బోయ కష్ణుడు, భాస్కర్, హుస్సేన్, ఎన్. వీరన్న, ఎన్. విజయ భాస్కర్ రాజు, టీ.జ్యోతి ప్రకాష్, ఏ. ఆర్ హెడ్ కానిస్టేబుల్స్ జి.కష్ణయ్య, లక్ష్మీనారాయణ, లకు ఎస్పీ మెడల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయుధ దళ డీ.ఎస్పీ నరేందర్ రావ్, ఎస్బీి ఇన్స్పెక్టర్ జమ్ములప్ప, సీసీ ఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి, అర్ ఐ వెంకటేష్ , ఎస్సై లు, పోలీస్ కార్యాలయ అధికారులు,పోలీస్ సిబ్బంది, భరోసా సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ – ధరూర్
జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండల కార్యాలయం లో రాష్ట్ర అవ తరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ కోసం అమ రులైన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ధరూర్ మండలం పంచాయితీ సెక్రటరీ రాధాకష్ణ రెడ్డి, కాంగ్రెస్‌నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ర్యాలంపాడు నరేందర్ రెడ్డి, రాజారెడ్డి, మాజీ ఎంపీటీసీ దుబ్బన్న,మాజీ జెడ్పీటీసీ కరెన్నా, జాకీర్, ఉపసర్పంచ్ సవారాన్న, రామిరెడ్డి, దేవాన్న, నాగన్న, వెంకటేష్, ధరూర్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నవ తెలంగాణ – గట్టు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంను గట్టు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలోని మండల కేంద్రంలోని తహసీల్దార్, మండల పరిషత్ కార్యా లయం, కేజీబీవీ, పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ సబ్‌స్టేషన్, మండల మహిళా సమైక్య భవనం తోపాటు గ్రామాలలోని పాఠశాలలు, పంచా యతీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరిత రాణి , ఎంపీపీ విజరు కుమార్, జెడ్పీటీసీ బస్సు శ్యామల హనుమంత నాయుడు, ఎస్‌ఐ రామకష్ణ, ఎంపీటీసీలు , పంచాయతీ కార్యదర్శులు ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నవ తెలంగాణ – అలంపూర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అలంపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అలంపూర్ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జీి కోర్టు నందు జూనియర్ సివిల్ జడ్జీి కమలాపురం కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. తహసీిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మంజుల, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మనోరమవెంకటేష్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బేగంగోకారి, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ నాగరాజు, ఎమ్మార్సీ భవణం వద్ద ఎంఈఓ అశోక్ కుమార్, ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇస్మాయిల్, గోకారి, కోర్టు నందు న్యాయవాదులు శ్రీధర్ రెడ్డి, తిమ్మారెడ్డి, వెంకట్రాములు, సునీల్ కు మార్, అప్రోజ్, మధు, కోర్టు సూపర్డెంట్ వీర వసంతుడు, జూనియర్ అసిస్టెంట్ చిన్న రాజు, శర్మ, లోక్ అదాలత్ సాయితేజ, పురేందర్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ – ఉండవల్లి
తెలంగాణ రాష్ట్ర ఆవీర్భావ దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ప్రభుత్వ పాఠశాలలోనూ ఉపాధ్యాయులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి వేడుకలను జయప్రదం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎటువంటి ఉపన్యాసాలు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలను నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజలు గుర్తుండేలా ఆవిష్కరణలో భాగంగా కార్యక్రమాన్ని స్థానికులు పాల్గొని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీిల్దార్ వెంకట్రావు , అభివద్ధి అధికారి జవాన్ ఆ మండల శాఖ అధికారులు పాల్గొన్నారు.
మనపాడులో..
మనపాడు మండలంలోని అధికారులు, మాజీ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఆవీర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాల్లోనూ గ్రామపంచాయతీ పరిధిలోని జెండాను ఆవిష్కరించి తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పంచాయతీ కార్యదర్శులు పోలీస్ శాఖ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నవతెలంగాణ – అయిజ
అయిజ పట్టణ కేంద్రంలో పాతబస్ స్టాండ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. ఏర్పాటు చేసిన అవతరణ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి దశాబ్ద కాలం అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఏ. ఐ. సీసీ . అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి క్షేరాభిషేకం చేసి, జాతీయ జెండాను ఎగుర వేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో… జిల్లా ఎస్. సి. సెల్ అధ్యక్షులు మద్దిలేటి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సురేష్ గౌడ్.,జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, ఎస్. టీ. సెల్ జిల్లా కార్యదర్శి వై. శివ, మహిళా అధ్యక్షురాలు సులోచనమ్మ, పట్టణ ఉపాధ్యక్షులు కష్ణారెడ్డి,బీసీ సెల్ అధ్యక్షులు బస్వరాజు, మైనారిటీ సెల్ అధ్య క్షులు షాలి, ఎస్. సీ. సెల్ అధ్యక్షులు ముక్కెరన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం. నజీర్ అహ్మద్,రవీంద్ర,రాజు నారాయణ,టి. చెన్నప్ప, టి. నర్సింహులు, చంటి, దూద్ పాషా, పరమేష్, చిన్న, ఈరేష, గోవింద్, రజాక్,తాయప్ప, కష్ణ, రఘు, వీరేష్,అంజి,అబ్దుల్లా, సుందర్, బాలరాజు,మాల శివరాజ్, సోడా హనీఫ్, నర్సింహా ఆచారి,భూపతి గౌడ్, తిరుమలేష్ ఆచారి,పౌలు, హరిజన ఈరన్న… తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అయిజ మునిసిపాలిటీలో..
అయిజ మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవీర్భావ దినోత్సవ వేడుకలను ఘనం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. మునిసిపాలిటీ చైర్మన్ చిన్నదేవన్న, వైస్ చైర్మన్ మాల నరసింహులు భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ,తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ , తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు , పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయిజ మున్సిపాలిటీ కమిషనర్ సత్య బాబు, ఏ.ఈ గోపాల్, కౌన్సిలర్స్ సీఎం సురేష్, శశికళ, నాగమ్మ, చాకలి నరసింహులు, శ్రీరాములు, ఆంజనేయులు, పూజారి వెంకటేష్, బీ అర్ ఏస్ నాయకులు చాకలి హుస్సేన్ , ఎండీ ఖాజా, చందు, బీ అర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు ప్రజలు, మునిసిపాలిటీ కార్యాలయ సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ – మరికల్
మరికల్ మండల కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట సీఐ కార్యాలయం, ఎస్‌ఐ కార్యాలయం వద్ద సీఐ రాజేందర్రెడ్డి ఎస్‌ఐ మురళి జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీవో పావని, ఎంపీడీవో కార్యాల సిబ్బంది జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సునీత కార్యాల సిబ్బంది జెండా ఆవిష్కరణ చేశారు. పలు ప్రభుత్వ కార్యాలయంలో తెలంగాణ ఆవీర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మరికల్, యువక మండలి కార్యాలయం, గ్రంథాలయ కార్యాలయం, జెడ్.పీ.హెచ్.ఎస్ బాలుర, జెడ్పీహెచ్‌ఎస్ బాలికల, ఉర్దూ మీడియం, వివిధ పాఠశాలల వద్ద మరికల్ మండల పరిధిలో గల వివిధ గ్రామాలలో తెలంగాణ ఆవీర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆవిర్భావం కోసం పోరాడిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేస్తూ, ఆ నాటి అమరుల త్యాగాలు ఈనాడు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు దోహదపడిందని గుర్తు చేసుకుంటూ చాలా గొప్పగా ఈ దశాబ్ది ఉత్సవాలను మండలం ప్రభుత్వ కార్యాలయాల్లో , ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో, గ్రామపంచాయతీ యందు స్పెషల్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, పంచాయతీ సిబ్బంది, జాతీయ జెండాను ఆవిష్కరించి ఆవీర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.