
నవతెలంగాణ- దుబ్బాక రూరల్
దుబ్బాక మండలం గోసాన్ పల్లి గ్రామానికి చెందిన బీజేపీ యువ నాయకుడు అంబటి శివప్రసాద్ గౌడ్ భారతీయ జనతా పార్టీ దుబ్బాక మండల అధ్యక్షునిగా నియామకమయ్యారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వారికి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అంబటి శివప్రసాద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో అతి చిన్న వయసులో అతిపెద్ద బాధ్యత అప్ప జెప్పిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పటిష్టత కోసం ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.