ఇటీవల జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారం అందుకున్న మండల ఎంపిడిఓ సోలమన్ రాజ్ ను శనివారం మండలంలోని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్ ఎం. ఆంజనేయులు, ఫీల్డ్ అసిస్టెంట్ అంబకంటి శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.