–
పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.

– ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.
నవతెలంగాణ – భువనగిరి
అంబేద్కర్ జయంత్ రోజున అంబేద్కర్ భవన్ ను ప్రారంభిస్తామని భువనగిరి శాసనసభ్యులు కే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు సింగన్నగూడెం చౌరస్తాలో అసంపూర్తిగా ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణ పనులను కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ నిధుల నుండి అంబేద్కర్ భవన నిర్మాణం కోసం రూ. 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడానికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ భవనం పూర్తి నిర్మాణం కావడం కోసం నేనుగా రూ.40 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ 14 ఏప్రిల్ వరకు ఈ భవనం నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం సేవకుల ప్రభుత్వంగా భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి పట్టణంలో అంబేద్కర్ భవనాన్ని మొదటి పనులుగా స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తూ ఈ భవనాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాదుకు కుతవేటు దూరంలో ఉన్న ఈ భవనం డబ్బా ఆకారంలో ఉండడాన్ని చూసి ఎమ్మెల్యే అధికారులను మందలించారు. ఈభవనం పోర్టికో గ్రీనరీ వెలివేషన్ కారు పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యాలను కల్పించాలన్నారు. ముఖ్యంగా వివిధ జిల్లాలలో నిర్మించిన అంబేద్కర్ భవనాలను పరిశీలించి భువనగిరి పట్టణంలో నిర్మిస్తున్న అంబేద్కర్ భవనంలో సరైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడిటోరియం కు సంబంధించి గతంలో అధికారులు,పాలకులు,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలన్నారు. భవన్ పూర్తి అభివృద్ధికి 1కోటి రూపాయలు కేటాయించిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కి, ఎమ్మెల్యేకు కుంభం అనిల్ కుమార్ రెడ్డి లకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బట్టు రామచంద్రయ్య ,కౌన్సిలర్లు పడిగెల రేణుక ప్రదీప్, ఈరపాక నరసింహ, నాగారం అంజయ్య, డి రాములు, బర్రె సుదర్శన్, దర్గాయి నర్సింగరావు, బుగ్గ మైసయ్య కర్తల శ్రీనివాస్ చిలకమర్రి గణేష్ కంచనపల్లి నరసింహారావు కొల్లూరు రాజు, జాలిగం శివ, గ్యాస్ చిన్న, అందే నరేష్, డాకూరి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోత్నక్ ప్రమోద్ కుమార్ తంగళ్ళపల్లి రవికుమార్ కూర వెంకటేష్ వడిచర్ల కృష్ణ యాదవ్ కైరంకొండ వెంకటేష్ బిస్కుంట్ల సత్యనారాయణ జగన్ రవీందర్ రెడ్డి కళ్యాణ్ పాల్గొన్నారు.