అంబేద్కర్ డిగ్రీ ప్రవేశాల గడువు  సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు: గంజి రమేష్ 

నవతెలంగాణ – భువనగిరి
డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం (బీఆర్ఎఓయూ) డిగ్రీ కోర్సుల్లో  ప్రవేశాలకు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు భువనగిరి శ్రీ లక్ష్మినరసింహ డిగ్రీ కళాశాల లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ కో- ఆర్డినేటర్ డాక్టర్ గంజి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో  తెలిపారు. బిఏ, బీకాం , బీఎస్సీ లో ప్రవేశానికి ఇంటర్ చదివిన విద్యార్థులు, పదో తరగతి తర్వాత రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు చేసిన వారు, ఇంటర్ సర్టిఫికెట్ లేదా సమాన స్థాయి కలిగిన నేషనల్ ఓపెన్ స్కూల్ సోసైటీ విద్యార్హత కలిగిన వారు  అర్హులేనని తెలిపారు, రెండు సంవత్సరాలు ఐటిఐ చేసిన వారు  అర్హులేనని ఆయన తెలిపారు. విద్యార్హతలు, ఫీజుల వివరాలు వెబ్సైట్ లో పొందుపర్చామని ఆయన తెలిపారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు   సెప్టెంబర్ 30 లోపు ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాలని ఆయన కోరారు. పూర్తి సమాచారం కోసం సెల్ 9000590545 నంబర్ ను సంప్రదించాలన్నారు.