– తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
నవతెలంగాణ తుంగతుర్తి: కోట్లాదిమంది జీవితాల్లో వెలుగులు నింపి, అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో వారి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ మేరకు సమాజంలోని నిమ్నజాతి వర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువచేసే దిశగా రాజ్యాంగ రచన చేసినట్లు వివరించారు. అంబేద్కర్ కృషి వల్లే నేడు అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నట్లు తెలిపారు. సమ సమాజ నిర్మాణంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ను ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి “సింబల్ ఆఫ్ నాలెడ్జిగా” గుర్తించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్, రవికుమార్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.