కోట్లాది గుడిసెల్లో నిరంతరం వెలిగే జ్ఞాన దీపం అంబేద్కర్

– బీఆర్ఎస్ జిల్లా నాయకులు డా.ర్యాకల శ్రీనివాస్
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో భరత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని , బిఆర్ఎస్ జిల్లా నాయకులు డా, ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ అణగారిన పీడిత ప్రజల జీవితాలను మార్చడానికి తన కుటుంబాన్ని తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా కృషి చేసిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు, లొంగని ఆత్మగౌరవ పోరాటం తాకట్టు పడని తిరుగుబాటు అనితర సాధ్యమైన మహోత్తర త్యాగం కోట్లాది గుడిసెల్లో నిరంతరం వెలిగే జ్ఞాన దీపం బిఆర్ అంబేద్కర్ అని అన్నారు, ఈ కార్యక్రమానికి గంజి సందీప్, పండుగ కిరణ్, ఎస్.కె యాకూబ్, ఎస్.కె హైమద్, ఉడుత రాజు, ఎడ్ల వెంకటేష్, పల్లెపాటి హరిశంకర్, పల్లెపాటి స్వామి, పల్లెపాటి బాలరాజ్, రాంపల్లి సుధాకర్ , గ్రామ ప్రజలు  పాల్గొన్నారు