అంబేద్కర్‌ జయంతి ర్యాలీని జయప్రదం చేయాలి

– ర్యాలీ కరపత్రం ఆవిష్కరణ
నవతెలంగాణ-సంగారెడ్డి
ప్రపంచ మేధావి, భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో మహార్యాలీ నిర్వహిస్తున్నట్టు అంబేద్కర్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ రామారావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అంబేద్కర్‌ భవన్లో కరపత్రం ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా రామారావు మాట్లాడుతూ.. ఈనెల 14న ఆదివా రం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణం లోని పీఎస్‌ఆర్‌ గార్డన్‌ నుంచి సాయంత్రం 4.30 గంటల కు ర్యాలీ ప్రారంభమవుతుందని.. జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ నుంచి పాత బస్టాండ్‌ వద్దగల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ కొన సాగుతుందన్నారు. ఈ ర్యాలీ కి వివిధ గ్రామాలు తండాలు మండలాలల్లో ఉన్న పెద్దలు, యువజన సంఘాల నాయ కులు, విద్యార్థులు, మహిళలు, అధికారులు, మేధావులు, కవులు కళాకారులు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబ ేద్కర్‌ ఉత్సవ కమిటీ నాయకులు దుర్గ ప్రసాద్‌, బి.అశోక్‌, రమని అనిల్‌, నాగరాజు, పవన్‌ కుమార్‌, నందకిషోర్‌, గంగేరి శ్రీహరి, సుమన్‌, రాజు నాయక్‌, ప్రమోద్‌ ,గోపాల్‌ నాయక్‌, యాదగిరి, బాలరాజు, సిహెచ్‌ రాజు, మురళి, దండు ప్రభు, డేవిడ్‌, ప్రదీప్‌ కుమార్‌, టి.కష్ణ తదితరులు పాల్గొన్నారు.