నవతెలంగాణ:మల్హర్ రావు.
ప్రపంచ మేధావి,బారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ అందరివాడని,ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యునైటెడ్ ఫోరమ్ ఆర్టీఐ కాటారం కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ అన్నారు.జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్లలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆదివారం అంబెడ్కర్ 133వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఎమ్మార్పీఎస్, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు సమసమాజ నిర్మాణానికి, స్వేచ్ఛ సమాత్వం పెంపొందించడానికి అంబెడ్కర్ సిద్దాంతాలు ఉపయోగపడతాయన్నారు.బారత రాజ్యాంగ నిర్మాత,బారత తొలి న్యాయశాఖ మంత్రిగా ఎన్నో సేవలందించిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అల్ఎంప్లాయిస్ సొసైటీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి రాజయ్య, సింగిల్ విండో వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,సొసైటీ కాళేశ్వరం జోనల్ కార్యదర్శి రావుల మొగిలి, జిల్లా ఉపాధ్యక్షుడు కేశారపు సురేందర్, కార్యదర్శి గుగ్గిళ్ల రాజ్ కుమార్,బండి స్వామి,తిర్రి అశోక్,మల్లేష్,బండి సమ్మయ్య,బాణయ్య,మేనం శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు