జుక్కల్ ఎమ్మెలే క్యాంపు ఆఫీసులో ఘనంగా అంబేడ్కర్ జయంతి

నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్ మండలంలోని ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రేస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రాజ్యంగా నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్కర్133వ జయంతిని కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా దుక్కల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి మండల దళిత సంఘం అధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా బస్వాపూర్, నాగల్ గావ్ , బిజ్జల్ వాడి, పెద్ద గుల్లా, సావర్ గావ్, పెద్ద ఎడ్గి, గ్రామాలలో అంబేడ్కర్ విగ్రహలకు పూజలు నిర్వహించారు, కొన్ని గ్రామాలలో అన్నదానాలు నిర్వహించారు. గ్రామాలలో ఉరేగింపులు నిర్వహించి అంబేడ్కర్ ఆశయాలను తెలిసేందుకు ప్రసంగాలు దళిత నాయకులు చేసారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ వర్కింగ్ ప్రసిడెంట్, సీనీయర్ కాంగ్రేస్ నాయకులు అనీల్, తదితరులు పాల్గోన్నారు.