
– అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్
నవతెలంగాణ – భూపాలపల్లి
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ 133వ జయంతి పురస్కరించుకుని అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న అంబెడ్కర్ జయంతి రోజున మహనీయుల ఆశయ సాధనలో కృషి చేస్తున్న వారిని గుర్తించి పూలే-అంబెడ్కర్ సేవా రత్న అవార్డులు ఇవ్వడం జరుగుతుందని అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ తెలిపారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో అంబెడ్కర్ జయంతి ఉత్సవాల ఆహ్వాన కరపత్రాలను సొసైటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా లింగమల్ల మాట్లాడారు మెరుగైన సమాజ నిర్మాణం కోసం,మహనీయుల ఆశయ సాధన కోసం సొసైటీలో ఉన్న వనరుల మేరకు మహనీయుల జయంతి,వర్ధంతి వేడుకలు నిర్వహిస్తూ, వారి జీవిత చరిత్ర గ్రంధాలు,పేద విద్యార్థులకు విద్య ఆర్థిక పరంగా ఆదుకోవడం,సామాజికంగా సేవలందించే వారిని ఘనంగా సన్మానించి,అవార్డులు ఉచితంగా అందజేయడమే. సొసైటీ లక్ష్యమన్నారు.ఈ జయంతి ఉత్సాబాల్లో సొసైటీ సభ్యులు, అంబెడ్కర్ వాదులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు,అంబెడ్కర్, విద్యార్థి సంఘాలు, కుల,మత, వర్గ, తేడా లేకుండా సంబడ వర్ణం ఈ జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ ఏవైయు కాళేశ్వరం జోనల్ అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, జోనల్ కోఆర్డినేటర్ పీక కిరణ్,ఏప్ యు అధికారప్రతినిది లిగామల్ల వెంకట స్వామి,జిల్లా కార్యదర్శి రాంచందర్, ఏవైయు జిల్లా ఉపాధ్యక్షుడు కేశారపు సురేందర్,కార్యదర్శి ఇందారపు రాకేష్,ఎస్సి,ఎస్టీ ఎంప్లాయిస్ జిల్లా నాయకుడు వనపాకల రాజయ్య, సింగరేణి ఎస్సి,ఎస్టీ ఎంప్లాయిస్ నాయకుడు కర్లపల్లి కిష్టస్వామి,తదితరులు పాల్గొన్నారు.