అంబేద్కర్ స్మారక భవనాన్ని నిర్మించాలి..

– బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు  వినతి..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ నియోజకవర్గానికి కేంద్రబిందువైన వేములవాడ పట్టణంలో అంబేద్కర్ స్మారక భవనాన్ని నిర్మించాలని, బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ వారు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక అధునాతనమైన లైబ్రరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ను ఆది శ్రీనివాస్   కోరారు.గురువారం బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా అధ్యక్షుడు జింక శ్రీధర్ మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ అభివృద్ధి కొరకు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వినతి పత్రాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన నిర్మాణ దశలో ఉన్న లైబ్రరీని పూర్తి చేసి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. మొదటి సంఘసంస్కర్తలైన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాలను వేములవాడ పట్టణంలో కూడలిలో ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.  బహుజన సేన ఇచ్చిన వినతి పత్రానికి సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ అభివృద్ధి కొరకు శుక్రవారం రోజున నిర్వహించుకునే భూమి పూజకు అంబేడ్కర్ అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లక్కె సాగర్, నేదూరి శ్రీకాంత్, ఆరేల్లి రాజు, మల్లారం హరిష్, ఆవునూరి గంగరాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.