నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు వచ్చేనెల మూడో తేదీ వరకు ఉన్నది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఎవిఆర్‌ఎన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి కామర్స్, ఇంగ్లీష్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు విశ్వవిద్యాలయ వెబ్‌పోర్టల్ షషష.bతీaశీబ.aష.ఱఅ లేదా షషష.bతీaశీబశీఅశ్రీఱఅవ.ఱఅ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తు ఫీజు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.వెయ్యి నిర్ణయించామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో డెబిట్/ క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా టీఎస్/ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో వచ్చేనెల మూడో తేదీ వరకు చెల్లించాలని కోరారు. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష అదేనెల 25న ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హైదరాబాద్ కేంద్రంలో మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను లేదా 040-23680411/498/240 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.