అంబేద్కర్ యువజన సంఘం హడక్ కమిటీ కన్వీనర్ గా మంతెన సమ్మయ్య 

నవతెలంగాణ –  మల్హర్ రావు
అంబెడ్కర్ యువజన సంఘము హడక్ కన్వీనర్ గా మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన మంథని సమ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రేమ్ సాగర్,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ తెలిపారు. ఆదివారం కొయ్యుర్ ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. దేశం,రాష్ట్రం,జిల్లాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపై జరుగుతున్న అసమానతలు దాడులు ఖండించాలని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి గ్రామ గ్రామాన తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగుల రాజు,ఉపాధ్యక్షుడు తాండ్ర మల్లేష్, లంబాడీ పోరాట హక్కుల సమితి జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సమ్మయ్య నాయక్,అక్కపాక సమ్మయ్య,పులిగంటి రాములు,ఇందారపు ప్రభాకర్, ముత్తయ్య,కిషన్ పాల్గొన్నారు.