అంబెడ్కర్ ఆశయాలను కొనసాగించాలి

– ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబెడ్కర్ వర్థంతి వేడుకలు
నవతెలంగాణ-మల్హర్ రావు : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కోనసాగించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు.శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘంసంగా నిర్వహించి,అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.అన్ని వర్గాల ప్రజలు సమానత్వంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని, రిజర్వేషన్లను తెచ్చినటువంటి ప్రపంచ మేధావన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు,జిల్లా కార్యదర్శి కేసారపు నరేష్ మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి తాండ్ర దినేష్ మాదిగ, ఖమ్మంపెళ్లి సందీప్ మాదిగ, కేసారపు రాజయ్య మాదిగ, ఇందారపు సమ్మయ్య మాదిగ, కేసారపు  ప్రతాప్ మాదిగ,ఇందారపు మల్లేష్ మాదిగ, మారపాక రాకేష్ మాదిగ, తాండ్ర రంజిత్ మాదిగ,జంగం అనిల్ మాదిగ పాల్గొన్నారు.