అంబేద్కర్ ఆశయాలే కాంగ్రెస్ లక్ష్యాలు..

Ambedkar's ambitions are the goals of Congress.– స్త్రీ శక్తి పధకానికి రూ.30 కోట్లు కేటాయింపు…

– మహిళా సాధికారత తోనే సామాజిక అభివృద్ధి…
నవతెలంగాణ – అశ్వారావుపేట
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యాలను ప్రజాపాలన విధానంలో అమలు చేస్తున్నాం అని,అందులో భాగంగానే ఆయన నేతృత్వం వహించిన రాజ్యాంగం అమలు అయిన రోజునే నాలుగు పధకాలను ప్రారంభించడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ప్రజాపాలన – పథకాలు ప్రారంభోత్సవం పేరుతో ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పధకాలను మండలంలోని పాత రెడ్డిగూడెం పంచాయితీలో ఆదివారం లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూర్తి కొండ రెడ్లు గిరిజన గ్రామం అయిన ఈ పంచాయితీలో 210 కుటుంబాలు ఉండగా నాలుగు పధకాల లో 304 మందిని లబ్ధిదారులు గా ఎంపిక చేసి రూ.5 కోట్ల 51 లక్షల 76 వేలు నిధులు కేటాయించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ శక్తి పధకానికి మండలానికి రూ.30 కోట్లు కేటాయించామని అయినా మహిళలు వినియోగించుకోవడంలో వెనుకబడి ఉన్నారని తెలిపారు.నాలుగు పధకాలకు ఎంపికైన లబ్ధిదారులకు స్వయంగా అర్హత పత్రాలను అందజేస్తానని అన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన మిత్ర సేన, తాటి వెంకటేశ్వర్లు,మెచ్చా నాగేశ్వరావు లు నియోజక వర్గాన్ని అభివృద్ది చేసారు అని,వారికంటే ఇంకొంచెం మెరుగ్గా అభివృద్ధి చేయడం మే నా లక్ష్యం అన్నారు. ప్రజా సంక్షేమం నేను తలపెట్టిన అభివృద్ధి యజ్ఞంలో అధికారులు సైతం నిర్విరామ కృషి చేస్తున్నారని వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి,పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్,తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,ఎం.పీ.డీ.ఓ ప్రవీణ్ కుమార్,ఏవో శివరాం ప్రసాద్,ఈజీఎస్ ఏపీవో రామచంద్రరావు,పీఏసీఎస్ అశ్వారావుపేట అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు,నాయకులు సుంకవల్లి వీరభద్రరావు,ప్రమోద్,నండ్రు రమేష్ లు పాల్గొన్నారు.