ఇజ్రాయిల్ దేశంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నవతెలంగాణ – ఆర్మూర్  

ఇజ్రాయిల్ దేశంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 133వ అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది.జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభ ప్రారంభానికి ముందు పంచశీల జెండాను యూత్ సభ్యులు ఎగురవేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.  ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ బలోపేతానికి కృషి చేసిన ఆర్మూర్ వేల్పూర్ ప్రాంతాలకు చెందిన సీనియర్లు పస్క సుధాకర్, బన్నీ, నీరడీ ప్రకాష్ లకు యూత్ సభ్యులు సన్మానం చేశారు. ఈ సభకు థింక్ స్మార్ట్ రాజ్ కుమార్ అధ్యక్షత వహించగా నీరడీ ప్రేమనందు, రజినీకాంత్, సుమన్, ప్రమోద్, ప్రవీణ్ తదితరులు తమ మాట పాటలతో సభికులను ఉత్సాహపరిచారు. తెలంగాణలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇజ్రాయిల్ లో ఉన్న సీనియర్లు, జూనియర్లు, సుమారు 100 మందితో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.