కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి

– రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలు మేనిఫెస్టో విడుదల చేయాలి,
వారికే తమ సంపూర్ణ మద్దతు
– సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెర్రిపోతుల పరశురాం డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలనే డిమాండ్ తో దేశవ్యాప్తంగా కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం జూలై 26 నుండి ప్రారంభమైన ఆందోళనలు నేటి వరకు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వల్లనే బ్యాంకింగ్ వ్యవస్థ మొదలైందని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిపై దేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకు కోసమే స్వార్థం కోసం చూస్తున్నారే తప్ప దేశానికి రాజ్యాంగం తెచ్చిపెట్టిన మహానుభావుడు అంబేద్కర్ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ఎందుకు ముద్రించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఎన్నికలవేళ తమ స్వలాభం కోసం ఓటు బ్యాంకు రాజకీయాల్లో కోసం అంబేద్కర్ను వివిధ రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారు తప్ప ఆయనపై కనీస గౌరవం పార్టీలకు లేదని ఆయన ఆవేదన వ్యక్తులు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ అయితే తమ మేనిఫెస్టోలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రిస్తామని ప్రకటిస్తారు వారికి తమ కమిటీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.