నవ తెలంగాణ -గజ్వేల్
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా శ్రీరామకోటి భక్త సమాజం పిలుపు మేరకు బుధవారం స్థానిక కష్ణాలయ దేవస్థానంవారు కాషాయ జెండాలకు రామాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. కాషాయ జెండాలు పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరాం నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది. అనంతరం ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ తీసి కష్ణాలయ దేవస్థానం వారు భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ కాషాయం జెండ పట్టుకున్న వారికి విజయమే తప్ప అపజయమే ఎరగరు అన్నారు. కాషాయం మన గుండెకాయ అన్నారు. కాషాయం విజయానికి నాంది. ప్రతి ఇంటి మీద కాషాయ జెండా ఎగరాలి మనము కళలు కన్నా అయోధ్య రాముని ప్రతిష్ఠ కళ్లారా చూడాలన్నారు. ఆలయ ప్రతినిధులు రామకోటి సంస్థకు జెండాలు అందించారు. కార్యక్రమంలో సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు, కష్ణాలయం అధ్యక్షులు ఎలగందుల రాంచంద్రం, ఉప్పల వెంకటేశం, దూబకుంట మెట్రాములు, అత్తెల్లి లక్ష్మయ్య, అంతునూరి శివకుమార్, ఉప్పల మధు, దొంతుల దశరథం, ధార రాంచంద్రం, మహంకాళి శ్రీనివాస్, తుమ్మ మల్లేశం, వేములవాడ కనకాచారి పాల్గొన్నారు.