అత్యవసర చికిత్సకు ఉపయోగపడే అంబులెన్స్‌

– ఏపీ సీఎం చంద్రబాబుకు అందజేత : వివేక్‌ ఆనంద్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అత్యవసర చికిత్సకు అవసరమైన పరికరాలతో కూడిన అంబులెన్స్‌ను ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అందజేసినట్టు పర్వతనేని చాబిటబుల్‌ ట్రస్ట్‌ కార్యదర్శి వివేక్‌ ఆనంద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగ ళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోషలిస్టు నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర పేరుతో ఏర్పడిన సామాజిక సేవా సంస్థ ఈ ట్రస్ట్‌ అని తెలిపారు. నిర్మాణ సామాగ్రి సంస్థ లీయుగాంగ్‌ ఇండియా ప్రయి వేట్‌ లిమి టెడ్‌ సంస్థ సౌజన్యంతో రోగుల అవసరాల కోసం అంబులెన్స్‌ను అందజేసినట్టు చెప్పారు.