పురుడు పోసిన అంబులెన్స్ సిబ్బంది..

– అంబులెన్స్ నిర్వహణ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన గర్భిణి స్త్రీ కుటుంబీకులు
నవతెలంగాణ -తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామానికి చెందిన ఊకే శాలిని 22 సంవత్సరాల గర్భిణీ స్త్రీ కి పురిటి నొప్పులు రావడంతో దగ్గర్లోని అంబులెన్స్ కి సమాచారం అందించారు. ఘటన విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఈఎంటి శివలింగం ప్రసాద్ పైలట్ కరుణాకర్ హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం సరిగ్గా రోడ్డు మార్గం కూడా లేకుండా చారవాణిలో సంప్రదించడానికి సిగ్నల్ కూడా లేని భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం తాడ్వాయి మండలం లింగాల గ్రామంకి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది బాధ్యుల చిరునామా తెలుసుకోవడానికి బాటసారులను అడిగి చివరిగా గర్భిణీ స్త్రీ ఇంటికి చేరుకొని రెండవ కాన్పు కావడంతో జరిగిన విషయాన్ని గుర్తించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ములుగు సామాజిక వైద్యశాలకు తరలిస్తున్న క్రమంలో పస్రా గ్రామం చేరుకోగా పురిటి నొప్పులు అధికం అవ్వడాన్ని గమనించిన ఈఎంటి శివలింగం ప్రసాద్ ఈ ఆర్ సి పి డాక్టర్ గోపీనాథ్ సార్ సూచన సలహాలతో సుఖ ప్రసాదం చేయగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అనంతరం బిడ్డకు అందించాల్సిన చికిత్సతో పాటు తల్లికి కావాల్సిన చికిత్స అందించి గోవిందరావుపేట ప్రాథమిక వైద్యశాలకు తరలించి జరిగిన విషయాన్ని వైద్యురాలకు వివరించి ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. సమాచారం అందిన వెంటనే బాధితురాలని సంప్రదించడానికి సిగ్నల్స్ లేని విషయాన్ని జిల్లా మేనేజర్ కి సమాచారం రూపంలో అందించగా ఎలాగైనా గర్భిణీ స్త్రీకి ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించడంతో చాకచక్యంగా వ్యవహరించి సుఖ ప్రసాదం చేసిన మొన్నటి సిబ్బంది ఈఎంటి శివలింగ ప్రసాద్ పైలట్ కరుణాకర్ ని జిల్లా ఆపరేషన్ మేనేజర్ చంద్రశేఖర్ తో పాటు గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ ఘటనలో 108 సిబ్బంది తో పాటు స్థానిక ఆశ వర్కర్ పద్మ గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులు ఉన్నారు.