అంబులెన్స్ సద్వినియోగం చేసుకోవాలి 

– చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 
నవతెలంగాణ జైపూర్ 
చెన్నురు నియోజకవర్గం పరిధి కోటపల్లి, చెన్నూరు రూరల్, భీమారం మండలాల వారి సౌకర్యార్థం ప్రారంభిస్తున్న అంబులెన్స్ ను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం చెన్నూర్ క్యాంపు కార్యాలయం ఎదుట మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి 102, 108 అంబులెన్స్లను ప్రారంభించారు.