నవతెలంగాణ-గోవిందరావుపేట
దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను చట్టాల సవరణలను ఆపాలని సీఐటీయూ మండల అధ్యక్షుడు ఉమ్మిడి ఉపేంద్ర చారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసిల్దార్ సతీష్ కు అందించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర చారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని సీఐటీయూ ఆల్ ఇండియా కమిటీ పిలుపుమేరకు సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే సందర్భంగా ధర్నా వినతి పత్రం కార్యక్రమాలను చేయడం జరిగిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బొగ్గు గనుల వేలంపాటను నిలిపివేయాలని, అసంఘటితరంగ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, పని భద్రత కల్పించాలని, భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి, ఆశ, ఐకెపి మధ్యాహ్నం బోజనం రంగాలలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జిట్టబోయిన రమేష్, ఉపాధ్యక్షుడు మంచోజు బ్రహ్మచారి పల్లపు రాజు శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మంచాల కవిత నాయకులు ప్రేమ్ కుమార్ ,సతీష్, కొండయ్య, కోటిలింగం ,కృష్ణ ,బాపయ్య, వెంకటాచారి గాజోజు, బ్రహ్మచారి, సీత, సువర్ణ ,అచ్చమ్మ ,మచ్చ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.