– యుఎస్‌ఏ, హెచ్‌సీఏ చీఫ్‌ల భేటీలో నిర్ణయం
హైదరాబాద్: అండర్-19 స్థాయిలో అమెరికా, హైదరాబాద్ జట్లు స్నేహపూర్వక మ్యాచుల్లో తలపడేందుకు అవసరమైన కార్యాచరణ రూపకల్పనకు అమెరికా క్రికెట్ బోర్డు చైర్మెన్ వేణు రెడ్డి, హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ ఓ అంగీకారానికి వచ్చారు. సోమవారం మర్యాదపూర్వకంగా సమావేశమైన వేణు, జగన్‌లు క్రికెట్ అభివృద్దిపై విస్తృత స్థాయిలో చర్చించారు. హైదరాబాద్, అమెరికా జట్లు స్నేహపూర్వక సిరీస్‌ల కోసం పర్యటించేందుకు త్వరలోనే టూర్ క్యాలెండర్ తయారు చేయాలని భావించారు. వేణురెడ్డితో భేటీలో చర్చించిన అంశాలపై హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించి అధికారికంగా ప్రకటన చేస్తామని జగన్‌మోహన్‌రావు తెలిపారు.