విదేశీ విద్యకు కేంద్రంగా అమెరికా

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు విదేశీ విద్య పరంగా అగ్రగామి కేంద్రంగా యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ) నిలిచిందని కెరీర్‌ మొజాయిక్‌ తెలిపింది. వారి భవిష్యత్‌ వృద్ధికి యూజీ కోర్సులు తోడ్పడతాయని కెరీర్‌ మొజాయిక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీషా జవేరి మంగళవారం మీడియాతో చెప్పారు. అమెరికాలోని 300కు పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయ విద్యార్థుల నియామక సంస్థ, అమెరికాకు దక్షిణాసియాలో అతిపెద్ద విద్యార్థుల నియామక సంస్థ, కెరీర్‌ మొజాయిక్‌, హైదరాబాద్‌లో విద్యార్థులు, కౌన్సెలర్లు మరియు స్టడీ అబ్రాడ్‌ కన్సల్టెంట్‌లతో అవగాహన సెషన్‌లను ఏర్పాటు చేయడానికి 15 యూఎస్‌ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించిందని అన్నారు.