పాలస్తీనా సమూల విధ్వంసానికి అమెరికా, ఇజ్రాయిల్‌ కుట్రలు

America and Israel conspiracies for the radical destruction of Palestineపాలస్తీనాపై ఇజ్రాయిల్‌ గత 25 రోజులుగా అత్యంత దుర్మార్గంగా సాగిస్తున్న మారణ కాండకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇప్పటికే 10 వేల కు మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులు అత్యధికం. అనేక మంది జర్నలి స్టులు మరణించారు. వేలాది మంది ఆసుపత్రుల పాల య్యారు. ఆసుపత్రులు, విద్యాలయాలను సైతం వదిలి పెట్టడం లేదు. విద్యుత్తు, ఆహారం, మంచినీరు, వైద్యం వంటి కనీస అవసరాలకు ప్రజలు దూరమవు తున్నారు. అత్యధిక జనసాంద్రత కల్గిన ప్రాంతం గాజా. దాదాపు 10 లక్షల మంది ప్రజలు తమ ఇళ్ళ నుండి వెళ్ళిపో యారు. సుమారు 23 లక్షల మంది ప్రజలు నివసిస్తున్న గాజా ప్రాంతం బాంబుల దాడులతో అతలాకుతల మైంది. చివరకు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు అల్లాడి పోతుండటం అక్కడ నెలకొన్న భయం కర పరిస్థితులను తేటతెల్లం చేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ మెజారిటీ తీర్మా నం చేసి యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని విజ్ఞప్తి చేసినా ఇజ్రాయిల్‌ ఖాతరు చేయడం లేదు. పాలస్తీనాను ఈ దెబ్బతో తుడిచి పెట్టేయాలని, మొత్తం ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని నిశ్చయించుకుంది. ఇజ్రాయిల్‌ కుట్రలకు వంతపాడుతూ అమెరికా అత్యంత కిరాతక పాత్ర పోషిస్తోంది. మానవత్వం, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కును అమెరికా పూర్తిగా కోల్పోయింది.
అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమాస్‌ దాడి చేయడం పట్ల మొదట విమర్శలు తలెత్తాయి. అయితే ఈ దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందనేది తర్వాత అర్థమైంది అందరికీ. పాలస్తీనా సమస్యను దశా బ్దాలుగా పరిష్కరిం చేందుకు ముందుకు రాకపోగా అక్కడి ప్రాంతాలను ఆక్రమించుకుంటూ ప్రజలపై హింసకు పాల్పడింది ఇజ్రాయిల్‌ కాదా? అసలు హమాస్‌ను సృష్టించి, దానికి ప్రాణం పోసింది ఇజ్రాయిల్‌ కాదా? గాజా స్ట్రిప్‌, వెస్ట్‌ బ్యాంక్‌, తూర్పు జెరూసలెం ప్రాంతా లను ఏకపక్షంగా గుప్పిటపట్టి పాలస్తీనా స్వతంత్రతను నిరాకరిస్తూ అమెరికా అండదండలతో నిత్యం పాలస్తీనా ప్రజలను అనేక చిత్రహింసలకు గురిచేశారు. వారి సంప దను కొల్లగొట్టారు. ఆ ప్రాంతాన్ని యుద్ధ భూమిగా మార్చింది ఇజ్రాయిల్‌ దుందుడుకు వైఖరే. 1948లో ఏర్పడిన నాటి నుండి ఇజ్రాయిల్‌ దేశం పాలస్తీనాలో భూ ఆక్రమణకు పాల్పడుతూనే ఉన్నది. రాజకీయ ఆస్థిరతను ఎదుర్కొం టున్న ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు పాలస్తీనా అణచివేతకు పాల్పడుతున్నాడు. కాల్పులు విరమణను ఎట్టి పరిస్థితుల్లో పాటించబోమని, అలా చేస్తే హమాస్‌ తిరిగి పుంజుకుంటుందని, ఉగ్ర వాదం పెరిగిపోతుందని ఇజ్రాయిల్‌ నేతలు చెప్పడం వారి దురంహకారాన్ని స్పష్టం చేస్తున్నాయి.
1967 నాటికి ముందున్న భూ సరిహద్దులతో పాల స్తీనాను ఏర్పాటు చేయాలని, తూర్పు జెరూసలెం దేశ రాజధానిగా ఉండాలని ఏనాడో ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. పాలస్తీనా విమోచనా సంస్థ (పి.ఎల్‌.ఓ) అధ్యక్షునిగా యాసర్‌ అరా ఫత్‌కు ఐ.రా.సతో పాటు ప్రపంచ దేశా లు మద్దతుగా నిలిచాయి. పశ్చిమాసియాపై తన పట్టు ను నిలబెట్టుకోవడానికి, ఆ ప్రాంతంలోని చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా ప్రతి సందర్భంలోను ఇజ్రాయిల్‌ అరాచ కాలకు బాసటగా నిలిచింది. నిరంతరం యుద్ధ కాంక్షను ప్రేరేపిస్తూ ఘర్షణలకు ఆజ్యం పోస్తోంది. గత 56 ఏండ్లుగా పాలస్తీనా ప్రాంతంలో అణచివేత జరుగుతూనే ఉన్నది.
తక్షణమే కాల్పులు విరమణ పాటించి, శాంతి నెల కొల్పాలని, ప్రజ లకు మానవతా సహాయం అందచే యాలని ఐక్యరాజ్య సమితిలో జోర్డాన్‌ ప్రవేశపెట్టిన తీర్మా నానికి 120 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 44 దేశాలు గైర్హాజరు కాగా అమెరికాతో సహా 14 దేశాలు తీర్మా నాన్ని వ్యతిరేకించాయి. మరి ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశాలని చెప్పుకుంటున్న అమెరికా, బ్రిటన్‌లు ప్రజాస్వామ్య పద్ధతులను, విలువలను పైగా మెజారిటీ నిర్ణయాలను గౌరవించాలి కదా! ప్రజా స్వామ్య దేశాలకు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ తల్లి వంటిదని మన ప్రధాన మంత్రి, విదేశాంగ శాఖా మంత్రి ఘనంగా చెబుతూ ఉంటారు. పాలస్తీనాలో మానవత్వం మంట కలసిపోతుంటే ఐ.రా.సలో మనదేశ ప్రతినిధి గైర్హాజరు కావడం సహేతుకం కాదు. అలీనోద్యమ వ్యవస్థ ఏర్పడటంలో ముఖ్య భూమిక పోషించి ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న చరిత్ర మనది. మహాత్మాగాంధీ, పండిట్‌ నెహ్రు, శ్రీమతి ఇందిరాగాంధీ వంటి వారి ఆలోచనలకు భిన్నంగా మన విదేశాంగ విధానం అమెరికాకు అనుకూలంగా మారడం మన దేశ గౌరవ ప్రతిష్టలకు భంగకరం. ఇజ్రా యిల్‌ జరుపు తున్న అనాలోచిత, అమానుష, అమానవీయ దాడులను మన దేశం అడ్డుకో వాలి. పాలస్తీనా సమస్యపై మన ప్రధాని కొంతమంది విదేశీ నేతలతో మాట్లాడారు. భారత్‌ తరపున కొంత మేరకు మానవతా సహాయం అందజేయటం జరిగింది. అయితే మనదేశం నిర్వర్తించాల్సిన పాత్ర అత్యంత ముఖ్యమైనది. అమెరికా కను సన్నల్లో ఇజ్రాయిల్‌ చేస్తున్న ఊచకోతను గట్టిగా నిల దీయాలి. తీవ్రంగా నిరసించాలి.
పాలస్తీనా ప్రజలకు ప్రపంచ దేశాలలో వ్యక్తమవు తున్న సంఘీభావం అపూర్వం. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఎదుట వేలాది మంది పాలస్తీనీయులకు మద్దతుగా ప్రదర్శన చేశారు. ఇజ్రాయిల్‌ దాడులను ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు ఐ.రా.సకు చెందిన మొ త్తం 11 సంస్థలు నిరసించాయి. లండన్‌లో జరిగిన భారీ ప్రదర్శనలో సుమారు 5 లక్షల మంది పాల్గొన్నారు. తక్షణమే దాడులను విడనాడాలని 22 అరబ్‌ దేశాలు కోరాయి. అమెరికాలో కూడ పెద్ద సంఖ్యలో ప్రజలు హా జరై యుద్ధోన్మోదాన్ని ఖండించడం చూశాం. జి7కు చెం దిన ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, ఇటలీతో సహా పలు దేశాలు వెంటనే యుద్ధాన్ని విడనాడాలని ఇజ్రాయిల్‌ను కోరాయి. భారత్‌లో కూడ ప్రజలు అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలో పాల్గొన్నారు.
పాలస్తీనాపై చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఇజ్రా యిల్‌ విరమించేలా ప్రయత్నాలు మరింత తీవ్రతరం కా వాలి. పాలస్తీనాను స్వతంత్రదేశంగా ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా అంతర్జాతీయ సమాజం కృషి చేయాలి. దీనికి ఐ.రా.స., మనదేశం గట్టిగా పూనుకోవాలి. పాలస్తీనా ప్రజల జీవితా వసరా లను, వారి హక్కులు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు మరింత విస్తృతంగా జరగాలి. ప్రపంచ మానవాళి నుండి స్పందన, ఒత్తిడి, సంఘీభావం పెద్దఎత్తున పెరగాలి.
వి.వి.కే. సురేష్‌
94403 45850