ఆర్కిటిక్‌లో రష్యా నిర్మించనున్న అతిపెద్ద ఎల్‌ఎన్‌జి ప్రాజెక్ట్‌తో సహా రష్యా ఇంధన రంగం అభివద్ధిని ఆటంకపరచాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుందని స్టేట్ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారి జియోఫ్రీ ప్యాట్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఇంధన దిగ్గజం నోవాటెక్ అభివద్ధి చేస్తున్న రష్యా ఉత్తర యమల్ ప్రాంతంలో ఆర్కిటిక్ ఎల్‌ఎన్‌జి 2 ప్రాజెక్ట్‌ను అమెరికా ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటోందని సోమవారంనాడు ఫైనాన్షియల్ టైమ్స్ సదస్సులో మాట్లాడుతూ ప్యాట్ వెల్లడించారు. ”ఆర్కిటిక్ ఎల్‌ఎన్‌జి 2 నీటిలో మునిగి చనిపోయిందని నిర్ధారించడం మా లక్ష్యం” అని ఇంధన వనరుల సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్యాట్ బ్రిటీష్ వార్తాపత్రిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో చెప్పారు. ”రష్యా ఇంతకుముందు యూరప్‌కి సరఫరా చేసిన గ్యాస్‌ను పునరుద్దరించడానికి కొత్త ప్రాజెక్టులను అభివద్ధి చేయలేకపోవచ్చని నిర్ధారించుకోవడంపై మేము చాలా దష్టి పెడుతున్నాము.”
ఆర్కిటిక్ ఎల్‌ఎన్‌జి 2పై అమెరికా అనేక రౌండ్ల ఆర్థిక ఆంక్షలను విధించింది. వీటిలో తాజాగా నవంబర్ 2023లో ప్రకటించటం జరిగింది. 2022లో ఉక్రెయిన్‌లో మాస్కో తన సైనిక చర్యను ప్రారంభించినప్పటి నుంచి చౌకైన రష్యన్ పైప్‌లైన్ గ్యాస్‌ను యూరప్‌కు అందకుండా చేయటం పాశ్చాత్య ప్రతీకార చర్యలో కీలకమైన అంశం. రాయిటర్స్ అంచనా ప్రకారం, పైప్‌లైన్ ద్వారా గ్యాస్ లభించక పోవటం వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి యూరోపియన్ యూనియన్ 2023లో రష్యన్ ఎల్‌ఎన్‌జి కొనుగోళ్లను పెంచింది. 2022కి ముందు దాదాపు 8శాతంగా వున్న ఎల్‌ఎన్‌జి గ్యాస్ వినియోగం ప్రస్తుతం మార్కెట్‌లో 15శాతానికి పెరిగింది. గతంలో యూరోపియన్ యూనియన్ గ్యాస్ వినియోగంలో 37శాతం రష్యన్ పైప్‌లైన్ ద్వారా వచ్చేది.
రష్యా- ఉక్రెయిన్ సంఘర్షణను రష్యాకు వ్యతిరేకంగా అమెరికా వెన్నుదన్నుతో నడుస్తున్న యుద్ధంగా రష్యా పరిగణిస్తోంది. ఆర్థిక పోటీని అరికట్టడం దీని లక్ష్యాలలో ఒకటి. ఈ ప్రక్రియలో యూరోపియన్ల శ్రేయస్సును అమెరికా విస్మరించిదనే విషయం జగద్వితమే.
ఇలా ఐరోపా మార్కెట్‌ను కోల్పోయిన రష్యా తన ప్రధాన గ్యాస్ క్షేత్రాలను ఆసియాలోని వినియోగదారులతో, ప్రధానంగా చైనాతో అనుసంధానించే పైప్‌లైన్‌ల నిర్మాణంపై దష్టి పెట్టడానికి దారితీసింది.