అమిత్ షా దిష్టి బొమ్మ దగ్ధం..

Amit Shah Dishti doll burnt..నవతెలంగాణ – రెంజల్ 
భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శఖ మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని కోరుతూ మాల మహానాడు నాయకులు ఆదివారం రెంజల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆయన దిష్టిబమ్మను దగ్ధం చేశారు. ఉమ్మడి జిల్లాల మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నీ రడీ రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ యావత్ భారతదేశ ప్రజలకు కేంద్ర హోం మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనియెడల దళితుల నుండి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు డైరీ సాయిలు, గౌరవ అధ్యక్షులు బొడిగ రవి, మండల ఉపాధ్యక్షులు దేవరాజు, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు, గైని ఆనంద్, పోతురాజు ప్రభాకర్, జక్కల అబ్బయ్య, పోతరాజు మదన్, లోక గంగాధర్, రాజశేఖర్, ప్రసాద్, బ్యాగరి గంగాధర్, పెద్ద సాయిలు, మహేందర్, శివకుమార్, రమేష్, నారాయణ, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.