– సోమ మల్లారెడ్డి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట
అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానపరిచిన కేంద్ర హోం శాఖ మంత్రి భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని పసర గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై అంబేద్కర్ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పసర చౌరస్తాలో అంబేద్కర్ చిత్రపటం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడని విమర్శించారు. భరతమాత ముద్దుబిడ్డలం అని కల్లబొల్లి మాటలు చెబుతూ పార్లమెంటులో బిజెపి నిజస్వరూపాన్ని బయటపెట్టారని అన్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు . బిజెపి పాలనలో నిరుద్యోగం పెరిగిందని ధరలు ఆకాశాన్ని అంటాయని ఆరోపించారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు విద్య ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగం ప్రజలకు అనేక హక్కులు కల్పించిందని హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మరో పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొదిల చిట్టిబాబు జిల్లా కమిటీ సభ్యులు తీగల ఆదిరెడ్డి గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు నాయకులు ముమ్మడి ఉపేంద్ర చారి ,అంబాల మురళి ,ఎస్ డి అంజద్ జిట్టబోయిన రమేష్, చిన్నపల్లి అశోక్, పురుషోత్తం రెడ్డి. సామ చంద్రారెడ్డి మంచాల కవిత సువర్ణ, రాజేశ్వరి స్వరూప,.బుర్ర శ్రీనివాస్, సూర్యనారాయణ. కొమ్ము రాజు, అరుణ్ , జీవన్. మహేష్. మొగిలి, తదితరులు పాల్గొన్నారు.