నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రసిద్ధ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్, అమ్జద్ హబీబ్ సలోన్స్ వ్యవస్థాపకుడైన అమ్జద్ హబీబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమ్జద్ హబీబ్ ప్రీమియం సెలూన్స్ ఫ్రాంచైజింగ్‌ను మియ పూర్ లో సినీనటులు నందితా శ్వేతా, డింపుల్ హాయతి, అమ్జద్ హబీబ్, మహాన్యూస్ ఎంచి వంశీకృష్ణ, మహేష్, షహబుద్దిన్‌తో కలిసి ప్రారంభించారు. వందేండ్ల సుదీర్ఘ చరిత్రతో, మా సెలూన్స్ విజయవాడ, మియాపూర్‌లో ఇప్పుడు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు ఉన్నాయి. అమ్జద్ హబీబ్ సెలూన్స్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోమా ఈ బ్రాండ్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. చంచల్‌గూడ జైలులో ఖైదీలకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. షహాబుద్దీన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు మాస్టర్ ఫ్రాంచైజర్ మహేష్ బిజినెస్ హెడ్ ఆపరేషన్స్ నిర్వహకులు మాట్లాడుతూ అమ్జద్ హబీబ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అండ్ వ్యవస్థాపకుడు, 16 ఏండ్లపాటు ఏపీజే అబ్దుల్ కలాం వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్, అనేక బాలీవుడ్ సెలబ్రిటీల స్టైలిస్ట్ అని, బ్రాండ్ మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.