– నాణ్యతలో తేడా వస్తే చట్టపరం అయిన చర్యలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
పాఠశాలల పునర్నిర్మాణ పనులు ఎవరు చేయాలి అనే అంశాన్ని అమ్మ ఆదర్శం పాఠశాల కమిటీ లే ప్రతిపాదించాలని,ప్రధానోపాధ్యా యులు పర్యవేక్షణలోనే పనులు నిర్వహించాలని ఎం.పి.డి.ఓ శ్రీనివాస్ తెలిపారు. పాఠశాలలు అభివృద్ది పనులు ప్రతిపాదనలు, నిర్వహణ పై ప్రధానోపాధ్యాయులు,వి.ఒ సభ్యులకు శనివారం అవగాహన నిర్వహించారు.ఎం.ఇ.ఓ క్రిష్ణయ్య అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.బి ఏఈ క్రిష్ణ మాట్లాడుతూ 41 పాఠశాలలో గదులు,మరుగుదొడ్లు,విద్యుత్ సౌకర్యం కల్పించడానికి రూ.1 కోటీ 27 లక్షలు వ్యయం అంచనాతో నిధులు మంజూరు అయినట్లు తెలిపారు.రాజకీయాలకు అతీతంగా పాఠశాలలో అభివృద్ధి చేయాలని అన్నారు.