అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఎర్పాటు చెయాలి: కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.శుక్రవారం కలెక్టర్ వెబేక్స్ ద్వారా డి ఆర్డిఓ,డిఈఓ, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎంఈఓలు, ఏపియం లు, ఇంజనీరింగ్ అధికారులతో విడియో కాన్పిరెన్స్ నిర్వహించారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పాఠశాలలో  కమిటీల పర్యవేక్షణలో పలు అభివృద్ధి పనులు జరగనున్నాయి. దీనికి గాను ప్రభుత్వం గ్రామాలలో గ్రామ సమాఖ్య , పట్టణాలలో ఏరియా సమాఖ్య అధ్యక్షురాలు ఈ కమిటీలకు అధ్యక్షురాలుగా  వ్యవహరిస్తారు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కమిటీ లో సభ్యులుగా ఉంటారు.ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కన్వీనర్ గా వ్యవహరిస్తారు.ఈ కమిటీల పదవి కాలం రెండు సంవత్సరాలు ఉంటుందని,పాఠశాలలో అన్ని మౌళిక వసతుల కల్పనకు, విద్య ను మెరుగుపర్చటానికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పాఠశాల పర్యవేక్షణ త్రాగునీటి సౌకర్యాలు, విద్యార్థి విద్యార్థినిలకు మరుగుదొడ్ల నిర్మాణం, తరగతి గదుల విద్యుదీకరణ, పారిశుద్ధ్యం, విద్యార్థులకు యూనిఫామ్ కుట్టు పని ఈ కమిటీలు పని చేస్తాయి.జిల్లా లో 584 పాఠశాలో కమిటీల ఏర్పటు చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్కూల్ యూనిఫామ్ కుట్టే సామర్థ్యం గల మహిళ సంఘాలను గుర్తించి వారికి ఆర్డర్ ఇవ్వాలన్నారు.విద్యార్థులకు యూనిఫామ్ ని మొదటి విడతగా మే నెలలో, రెండో విడత జూన్ నెలలో అందజేయలన్నారు. అమ్మ ఆదర్శ కమిటిల పర్యవేక్షణలో జూన్ కల్లా పాఠశాలలో అన్ని మౌళిక వసతులు,పనులను పూర్తి చేయాలని కలేక్టర్ తెలిపారు.
ఈ కమిటీల ఏర్పాటు:
ఎంపిడిఓలు, ఎంఈఓ లు, ఎంపిడిఓ కార్యాలయాలలో కమిటీల ఏర్పాటుకై సమావేశం నిర్వహించుకోవాలని కలెక్టర్ తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనులను గుర్తించి   వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల వద్ద 25,000 అత్యవసర నిధులు వినియోగించుకోవచ్చని పాఠశాలలో చేపట్టిన పనులకు ఒక లక్ష రుపాయల వరకు ఎంపిడిఓ లు చెల్లించవచ్చని కలెక్టర్ తెలిపారు.
ఈ నెల 18 వ తారీఖు నుండి మొదలు కానున్న 10 వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని పరీక్ష కేంద్రాలలో సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్తు సరఫర ఉండాలని,అలాగే అన్ని పాఠశాలలో మౌళిక వసతులు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.అన్ని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.పరీక్ష కేంద్రాలలో మొబైల్ ఫోన్ల కు అనుమతి లేదని అన్నారు.జిల్లాలో ఎక్కడ త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని, 3 రోజులలో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.అలాగే పశువుల కొరకు నీటి టోట్లులలో  ఎప్పుడు నీరు నింపాలని పంచాయతీ కార్యదర్శిలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.