నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ అధ్యక్షతన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ వర్క్ షాప్ నిర్వహించారు. మండలంలోని 18 ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులపై వర్క్ షాప్ లో చర్చించారు. పాఠశాలల్లో అవసరమైన త్రాగునీరు సౌకర్యం, మైనర్ రిపేర్స్, విద్యుత్ సౌకర్యం తదితర వాటి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన అనే పద్యంలో వర్క్ షాప్ నిర్వహించి పాఠశాలలో అవసరమైన పనులను గుర్తించినట్లు ఈ సందర్భంగా ఎంపీడీవో తెలిపారు. వేసవి సెలవులు ముగిసి, నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమయ్యే లోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మండల విద్యాధికారి ఆంధ్రయ్య, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాస్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వివోలు, తదితరులు పాల్గొన్నారు.