అమ్మ అశోక్‌ రక్తదానం @45

అమ్మ అశోక్‌ రక్తదానం @45నవతెలంగాణ – శాయంపేట
మండలంలోని పెద్దకొడపాక గ్రామానికి చెందిన భారత జాగృతి రాష్ట్ర నాయకులు, సామాజిక సేవకుడు అమ్మ అశోక్‌ 45సార్లు రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పరకాల మండ లం పోచా రం గ్రామానికి చెందిన ఎనుముల సులోచన అనారోగ్యంతో బాధప డుతూ పరకాల ప్రయివేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు. రక్తం తక్కువగా ఉందని వైద్యులు తెలపడంతో ఆమె కుమారుడు అశోక్‌ కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. స్పందించిన అశోక్‌ ఆదివారం పర కాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లి 45వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చా టుకున్నాడు. ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేస్తూ అందరికీ ఆద ర్శంగా నిలుస్తున్న అశోక్‌ను పలువురు అభినందించారు.