మండల పరిధిలోని రామాంజిగూడెం గ్రామ పంచాయతీలో ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమం స్థానిక ఐసీడీఎస్ సూపర్వైజర్ కె.విజయ కుమారి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2 సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని ప్రజలకు తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో నర్సరీ తరగతులు నిర్వహించటం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. దీనికి ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎం.సుజాత, కె.కళావతి, యు.సుజాత, ఈ.భారతి, ఎఎస్ హెచ్ వీవోలు పాల్గొన్నారు.