అమ్మ మాట..అంగన్వాడీ బాట..

Mom's words.. Anganwadi path..నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఆటపాటలతో విద్యను బోధించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ అన్నపూర్ణ,వార్డు కౌన్సిలర్ సలిగంటి సరిత వీరేంద్ర లు అన్నారు. మంగళవారం 16వ వార్డు రామకృష్ణ స్కూల్ సెంటర్ అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని టీచర్ సంధినేని సృజన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు సంవత్సరాలలోపు పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్ చేస్తే వారి పాఠశాల పర్మీషన్ రద్దు చేయాలని అన్నారు. (ప్రైవేట్ పాఠశాలల మోజులో పడి (ఆడుకునే వయస్సు పిల్లల బతుకులు చిద్రం చేయకండి అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరు, ఆటపాటలతో కుండిన ఫ్రీ సర్కిల్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మంచి పౌష్టికాహారమైన గడ్డు, బాలామృతం, పోషక విలువలతో కూడిన భోజనం. అందిస్తూ పిల్లల్లో నైపుణ్య అభివృద్ధిని మెరుగుపరుస్తున్నామని అన్నారు. ఇలాంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోకుండా తల్లిదండ్రులు ప్రైవేటు పాఠనాలల మోజులో పడి రెండు సంవత్సరాలు కూడా నిండని పిల్లలను బడులకు పంపుతున్నారని అన్నారు. రెండున్నర సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీలకు పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయ ముత్తమ్మ, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.