
మండలంలోని లక్నవరం పంచాయతీ దుంపెల్లి గూడెం గ్రామంలో మంగళవారం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా ఒకటి రెండు సెంటర్లు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు దీప మరియు రుక్మిణి లు మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలను అంగన్వాడీ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల సకాలంలో ఎదుగుదలకు గర్భిణీ స్త్రీల జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈనెల 20 వరకు నూతన పిల్లలను అంగన్వాడి సెంటర్ ల నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అంగన్వాడీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.