మండలంలోని మద్దికుంట లో అంగన్వాడి ఆధ్వర్యంలో అమ్మ మాట- అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా శనివారం విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ.. అంగన్వాడీలో ఒత్తిడి లేకుండా ఆటపాటలతో కిశోర బాలలకు విద్యాబోధన ఉంటుందని, పౌష్టికాహారం అందిస్తున్నామని, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడి లో చేర్చాలని సూచించారు. వారం రోజుల నుండి విద్యార్థులకు నేర్పిన విద్య బోధనలు తల్లిదండ్రుల సమక్షంలో సమీక్షించారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బొమ్మిడి సుజాత, గజ్జల సుజాత, మూడ వెంకటలక్ష్మి, ఆయాలు, తల్లులు, కిశోర బాలలు తదితరులు పాల్గొన్నారు.