
మండలంలోని ఉప్లూర్ లో మంగళవారం అమ్మ మాట… అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మ మాట… అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అంగన్వాడి ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాల ప్రాముఖ్యత, పౌష్టికాహారంపై చిన్నారుల తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడి కేంద్రాల పరిధిలోని తల్లులకు, అంగన్వాడి బడి ఈడు పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో నమోదు చేయించాలని కోరారు. ప్రీ స్కూల్లో చిన్నారులకు ఆట పాటలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం వల్ల చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. తమ చిన్నారులను అంగన్వాడి కేంద్రాల్లో నమోదు చేసి వారి ఆరోగ్యానికి, సంతోషానికి అవకాశం ఇవ్వాలని అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులను నమోదు చేయించడం ద్వారా వారి భవితకు పునాది వేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, సరిత, ఆయాలు లక్ష్మీ, శారద, ఏఎన్ఎం అరుణ కుమారి, ఆశా కార్యకర్తలు, సిఏలు, చిన్నారుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.